News

పీజ్ రీయింబర్స్ మెంట్ పధకాన్ని అమలు చేస్తున్నాము


తాము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన పీజ్ రీయింబర్స్ మెంట్ పధకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఫీజు బకాయిలు చెల్లించడం సాధ్యం కాదని, విద్యార్ధుల సంఖ్య ఎంత అన్నదానిపై క్లారిటీ రావడానికి సమయం పడుతుందని, అందువల్ల దీనికి సమయం పడుతుందని అన్నారు.గతంలోకూడా ఒక ఏడాది బకాయిలు కొనసాగాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక 4867 కోట్ల రూపాయలు పీజ్ రీయింబర్స్ మెంట్ కింద చెల్లించామని అన్నారు. ఈ స్కీమ్ కు తాను పూర్తి అనుకూలమని ఆయన అన్నారు. కొందరు మేధావులు డబ్బు వృదా అవుతుందని అంటారని, కాని అది కరెక్టు కాదని గతంలో కూడా తాను ఖండించానని, ఇదంతా మానవ వనరుల అభివృద్ది లో భాగమేనని తాను చెప్పానని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించిన స్కీమునే తాము కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.విద్యార్దుల కు సంబందించిన ఈ సమస్యపై ఒకటే స్వరం అంతా కలిసి వినిపించాలన్నది తమ అబిప్రాయం అని కెసిఆర్ అన్నారు.